14 August, 2026 | 2:58 AM

అధికార పార్టీలో ముసలం..!

14-08-2026 01:24 AM
  1. 14వ వార్డు కౌన్సిలర్ రాజీనామా పది నిమిషాల్లో ఉపసంహరణ
  2. నాగర్‌కర్నూల్‌లో ‘రాజీ’ నాటకం రసవత్తరం

నాగర్ కర్నూల్, ఆగస్టు 13 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. 14వ వార్డు కౌన్సిలర్ నజీమా ఖాజా ఖాన్ ఆరోగ్య కారణాల దృష్ట్యా తన పదవిని వదులుకుం టున్నట్లు గురువారం మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజీనామా సమర్పించిన 15 నిమిషా ల్లోనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి మరో వినతిపత్రం అందజే శారు. దీంతో ఈ రాజీనామా అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

జిల్లా కేంద్రంలోని 15వ వార్డు పరిధిలో తాతల కాలం నుంచి వారసత్వంగా పొందిన భూ వివాదంలో ఇతరులు కబ్జా చేస్తున్నారం టూ స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డిలకు పలుమార్లు విన్నవించినా ససేమిరా అంటూ నే కబ్జాదారులకు సహకరించారనే ఆరోపణలున్నాయి. భూవివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ స్థానిక అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల చేత ఈ వ్యవహారమంతా నడిపించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యం లోనే రాజీనామా అంశం తెరమీదకి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

కౌన్సిలర్ పదవికి కాకుండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు అందుకే పునరాలోచన చేసి కౌన్సిలర్ పదవి రాజీనా మా ఉపసంహరించుకున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. అనంతరం పార్టీకి రాజీనామా చేసి ఒంటరిగానే కబ్జా వ్యవహారంపై పోరాడేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో స్థానిక అధికార, ప్రతిపక్ష ఇతర పార్టీ నేతల్లోనూ చర్చకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్ ఎంపిక ప్రక్రి యలోనూ మద్దతు తెలిపిన ఇతర కౌన్సిలర్లకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవడంతో కౌన్సిలర్లు అలకబూనారు. 

మరో పక్క చైర్మన్ తన అనుయాయులకు మాత్ర మే బాక్స్ టెండర్లు కల్పించి పనులు సాఫీగా జరిపించుకున్నట్లు ఇతర కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. బహిరంగంగా వీటిపై చర్చలు జ రుగుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఈ వ్యవహారాల పట్ల పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ అసంతృప్తి జ్వాలలు మరిం త పెరుగుతాయనే చర్చ జరుగుతుంది.