9 July, 2026 | 8:59 PM

త్వరలో టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ కొత్త వెర్షన్లు

10-05-2024 01:33 AM

చెన్నై, మే 9: టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది తన వాహనాల కొత్త వెర్షన్లు విడుదల చేయనుంది. తమ ప్రస్తుత ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్లను మార్కెట్లోకి ప్రవేశపెడతామని టీవీఎస్ మోటా ర్ కంపెనీ సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. ప్రస్తుతం మూడు వెర్షన్లలో ఐక్యూబ్ స్కూటర్లను కంపెనీ విక్రయిస్తున్నది. వివిధ బ్యాటరీ కెపాసిటీల్లో వివిధ ధరలకు కొత్త వెర్షన్లు విడుదల చేస్తామని సీఈవో వెల్లడించారు. అలాగే ఒక ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను  అభివృద్ధిపరుస్తున్నామని, ఇది తుదిదశలో ఉన్న దని, 2025లో మార్కెట్లోకి వస్తుందని వివరించారు.