calender_icon.png 5 October, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జుబీన్ మృతికేసులో ట్విస్ట్

05-10-2025 12:38:40 AM

  1. ఆయనపై విషప్రయోగం జరిగిందని ఆరోపణలు
  2. అస్సాం సీఐడీకి జుబీన్ బ్యాండ్‌మెట్ గోస్వామి వాంగ్మూలం

దిస్పూర్, అక్టోబర్ 4: అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ (52)పై విషప్రయోగం జరిగి మృతిచెందాడని, స్కూబా డైవింగ్ వల్ల కాదని ఆయన బ్యాండ్ సభ్యుడు శేఖర్‌జ్యోతి గోస్వామి ప్రకటించడం సంచలనం సృష్టించింది. జుబీన్ మృతిపై అస్సాం పోలీసులు పలువురి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దీనిలో భాగంగానే గోస్వామి సైతం పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు.

సింగపూర్‌కు చెందిన ఫెస్టివల్ నిర్వాహకులు జుబీన్ మేనేజర్ సిద్దార్థ్ శర్మతో కలిసి కుట్ర పన్ని ఉంటారని గోస్వామి ఆరోపణలు చేశాడు. ‘సింగపూర్‌లో జుబీన్‌తో కలిసి మేనేజర్ సిద్దార్థ్ శర్మ ఒకే హోటల్‌లో ఉన్నారు. స్కూ బా డైవింగ్ కోసం వెళ్లిన కొద్దిసేపటి తర్వాత జుబీన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ సమయంలో శర్మ ప్రవర్తన మాకు వింతగా తోచింది. బోటు సముద్రం మధ్యలో ఉండగా, శర్మ తన నియంత్రణలోకి తీసుకున్నాడు.

శర్మ అంతకముందు జుబీన్‌కు విషం కలిసిన డ్రింక్ ఇచ్చి ఉంటాడు’ అని అనుమానం వ్యక్తం చేశాడు. జుబీన్ ముని గిపోతున్న సమయంలోనూ ‘అతడిని వెళ్లనీయండి’ అని శర్మ అరిచాడని తెలిపాడు. తర్వాత కొద్దిసేపటికి గార్డ్ మృతిచెందాడని తెలిపాడు.

గార్గ్ ఈతలో ఎంతో శిక్షణ పొం దిన వాడని, నీటిలో మునిగి ప్రాణాలొదిలే పరిస్థితే రాదని చెప్పుకొచ్చాడు. మరోవైపు జుబీన్ మృతికేసులో పోలీసులు ఇప్పటికే మేనేజర్ శర్మ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చా రు. ఫెస్టివల్ నిర్వాహకుడు మహంతపైనా కేసు నమోదు చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం  సీఐడీ కస్టడీలో ఉన్నారు.