సభ ముందుకు రెండు బిల్లులు
వేతన సవరణ, వైద్య విదానపరిషత్ బిల్లులు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి ): అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం సభలో తెలంగాణ వేతన సవరణ, వైద్యవిదానపరిషత్ బిల్లులను టేబుల్ చేశా రు. ఈ బిల్లులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. సోమవారం సభలో ముందు ప్రశ్నోత్తరాలు నిర్వహించా రు.
అనంతరం భట్టి విక్రమార్క తెలంగాణ(పబ్లిక్ సర్వీసులకు నియామకాల క్రమబద్ధీక రణ, సిబ్బంది తీరును, వేతన స్వరూపాన్ని హేతుబద్ధం చేసే) (మూడవ సవరణ) బిల్లు ను ప్రతిపాదించారు. అనంతరం వేతన సవరణ బిల్లును ఆమోదించవాలని ప్రతిపా దించారు.
దీంతోపాటు 2018 సంవత్సరానికి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ 5వ వార్షిక నివేదిక ప్రతిని కూడా సభా సమక్షంలో ఉంచారు. మధ్యాహ్నం వైద్య విదానపరిషత్ తెలంగాణ బి ల్లును భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.




