ఇద్దరు కెప్టెన్లకు జరిమానా..
21-04-2024 12:25 AM
లక్నో: చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లకు ఏకకాలంలో జరిమానా పడింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఇరు జట్ల సారథులైన రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. సీజన్‌లో ఇదే తొలిసారి కాబట్టి ఇద్దరికి జరిమానాతోనే సరిపెట్టినట్లు తెలిపింది. మరోసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడితే జరిమానా రెట్టింపు అవుతుందని వెల్లడించింది. ఇక మ్యాచ్‌లో లక్నో 8 వికెట్ల తేడాతో చెన్నైపై విజయాన్ని నమోదు చేసుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లోనే 83 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.






