17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అభివృద్ధే ప్రధాన ఎజెండాగా..

07-02-2026 12:37 AM

ముకరంపుర బీజేపీ 51వ డివిజన్ అభ్యర్థి బండారి వేణు

ముకరంపురా, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): తనకు ఓటువేసి ఆశీర్వదించి కార్పొరేటర్‌గా గెలిపిస్తే డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తానని, అభివృద్ధే నా ప్రధాన ఎజెండా అని బీజేపీ 51వ డివిజన్ అభ్యర్థి బండారి వేణు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం డివిజన్ లోని గడప గడపకు వెళ్లి ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ తెచ్చిన నిధులతోనే నగరం అభివృద్ధి చెందిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం  కరీంనగర్ ను  స్మార్ట్సటీగా ఎంపిక చేసి నిధు లు విడుదల చే సిందని, నిధులతోనే న గరంలో అభివృద్ధి పనులు పూర్తి చేశారని తెలిపారు. డివిజన్ అభివృద్దితో పాటు ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపు తానన్నారు. డివిజన్ ప్రజలకు తాను చేసిన సేవలు తెలుసునని తమ మరో మారు ఆశీర్వదించాలని మీలో ఒకనిగా సేవ చేసే అవకాశం కల్పించాలని బండారి వేణు కోరారు.