కారును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
04-08-2025 11:31 AM
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్(Gajwel police station limits) పరిధిలోని ప్రజ్ఞాపూర్ సమీపంలో రాజీవ్ రహధారిపై ఆదివారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కోనాపూర్ నివాసి సందీప్ (19), మిరుదొడ్డి నివాసి రాజు (26)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలినట్లు పోలీసులు తెలిపారు.






