04-08-2025 10:40:46 AM
హైదరాబాద్: చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో(Telangana Congress BC leaders) ప్రత్యేక రైలు ఢిల్లీ బయలుదేరింది. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతలు ప్రత్యేక రైలులో కార్యకర్తలతో కలిసి రైలులో ప్రయాణం చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా చలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
బిల్లు ఆమోదించాలనే డిమాండ్ తో ఈ నెల 6న ఢిల్లీలో ధర్నా, ఎల్లుండి ఢిల్లీలోని జంతర్ మంతర్(Delhi Jantar Mantar) వద్ద కాంగ్రెస్ మహా ధర్నా చేపట్టనుంది. కాంగ్రెస్ నేతలు ధర్నాలో పాల్గొనేందుకు ఇవాళే బయలుదేరుతున్నారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున హస్తినకు వెళ్తున్నారు. ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. బీసీ రిజర్వేషన్ పెంపుపై చర్చ కొరుతూ కాంగ్రెస్ ఎంపీలు రేపు పార్లమెంట్ లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ నేతలు ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు.