6 April, 2026 | 6:23 AM

పల్లె పాలన అస్తవ్యస్తం!

02-12-2024 12:00 AM
  1. పంచాయతీలకు నిధుల కొరత
  2. గ్రామాల్లో గాడి తప్పుతున్న పాలన
  3.  పనులు చేయమని మొండికేస్తున్న కార్మికులు
  4. నిర్మల్ జిల్లాలో సొంత డబ్బు వెచ్చిస్తున్న కార్యదర్శులు 

నిర్మల్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ప్రభుత్వం నిధులు విడు దల చేయకపోవడంతో పల్లెల్లో పాలన గాడి తప్పుతోంది. నిర్మల్ జిల్లాలో 19 మండలాలు.. అందులో 400 గ్రామ పంచాయతీలు ఉండగా 367 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా జనాభా ఆధారంగా మంజూరు కావాల్సిన నిధులు మూడు నెలలుగా రాకపోవటంతో ప్రగతి పనులపై ప్రభావం పడు తోంది.

సర్పంచ్‌లు ఉన్నప్పుడు మొదట వా రు ఖర్చు చేసి ప్రభుత్వం మంజూరు చేసిన గ్రాంట్‌తో బిల్లులు తీసుకునేవారు. ప్రస్తుతం వారి పదవీ కాలం ముగియంటంతో ప్రభు త్వం ఆ బాధ్యతను ప్రత్యేక అధికారులకు అప్పగించింది. అయితే జనాభాను బట్టి రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు గ్రాం ట్ వచ్చే గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవటంతో పాలన ప్రశ్నార్థకంగా మారింది.

కార్యదర్శుల సొంత నిధులు..

ప్రభుత్వ గాంట్ విడుదల కాకాపోవడంతో పంచాయతీ పనుల నిర్వహణ కార్య దర్శులపై పడుతోంది. కొన్ని చోట్ల పారుశుద్ధ్య కార్మికుల వేతనాలు, వీధి దీపాలు, నల్లాల నిర్వహణ వంటి ఖర్చులకు ఒక్కో కార్యదర్శి సుమారు రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈక్రమంలో లక్ష్మణచందా మండ లంలోని  ఓ కార్యదర్శి ఇప్పటివరకు  రూ.2.50 లక్షలు సొంత నిధులు ఖర్చుపెట్టి ఉన్నతాధికారులకు వివరించారు.

వారు పట్టించుకోకపోగా మరో పంచాయతీకి ఇంచార్జిగా నియమించడంతో అక్కడ కూడా రూ.50 వేలు అప్పు తెచ్చి ఖర్చు చేసినట్టు అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వం వెంట నే పంచాయతీలకు ప్రతి నెలా నిధులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. సమస్య తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే ప్రభుత్వ నిధులు వస్తాయని ఆయన తెలిపారు.

మొండికేస్తున్న కార్మికులు..

గ్రామ పంచాయతీలకు ప్రభు త్వం చెల్లింపులు చేయకపోవడంతో నెల పూర్తయ్యే సరికి ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. పారుశుద్ధ్య నిర్వహణకు జిల్లా మొత్తంగా 396 ట్రాక్టర్లు ఉండగా.. 140 ట్రాక్టర్ల బకాయిలకు ప్రభుత్వం చెలి్ంలచాల్సి ఉం దని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా కిస్తుల కింద రూ.63 లక్షలు చెల్లించక పోవడంతో ట్రాక్టర్ల యజమానులు పంచాయతీలపై ఒత్తిడి తెస్తున్నారు.

చెత్త సేకరణ కోసం ట్రాక్టర్‌కు డీజిల్, పారుశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లకు వేతనాలను పంచాయతీలు చెల్లించాలి. నిధులు లేమితో వేతనాలు ఇవ్వకపోవడం తో కార్మికులు పనిచేయమని మొం డికేస్తున్నారు. దీంతో పనుల విషయంలో కార్యదర్శులు భయంగా విధులు నిర్వహించాల్సి వస్తోంది.