అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలు పట్టివేత
19-06-2026 12:00 AM
అలంపూర్, జూన్ 18: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను ఉండవల్లి పోలీసులు గురువారం తెల్లవారుజామున పుల్లూరు టోల్గేట్ సమీపంలో పట్టుకున్నారు. బ్లూ కోర్టు డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లు బి. చంద్రబాబు నాయుడు, కే. రవి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇసుక లోడుతో వెళ్తున్న AP39TV1973, AP39U5868 నంబర్ల లారీలను ఆపి తనిఖీ చేశారు.
లారీ డ్రైవర్లు రాజేష్ (48), నరేష్ (34)లు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మంత్రాలయం నుంచి హైదరాబాద్కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు.దీంతో వారిని అదుపులోకి తీసుకుని వాహనాలను స్వాధీనం చేసుకుని తగు చర్యల కోసం ఉండవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






