19 June, 2026 | 1:35 AM

రైతుల ప్రయోజనాలే లక్ష్యం

19-06-2026 12:00 AM

 జిల్లా కలెక్టర్ కె. హరిత 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనా లు, ఎరువులు అందేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. గురువారం ఆసిఫాబాద్ మండలం బురుగూడా గ్రామం లోని కళావతి ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె పత్తి విత్తనాల ప్యాకెట్లు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.

దుకాణంలో ఉన్న విత్తనాలు, ఎరువుల ని ల్వల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయకపోవడంపై యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే దుకాణంలో అందుబాటులో ఉన్న వి త్తనాలు, ఎరువుల వివరాలను బోర్డుపై స్ప ష్టంగా ప్రదర్శించాలని సూచించారు.

ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులను మో సం చేసే విధంగా నకిలీ పత్తి విత్తనాల విక్రయాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు. నిషేధిత గడ్డి మందులు లే దా ఇతర వ్యవసాయ రసాయనాల విక్ర యం జరిగితే సంబంధిత డీలర్లపై కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎరువులు, విత్తనాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

:-పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్య త అని, వనమహోత్సవం సందర్భంగా మొ క్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు. గురువారం రెబ్బెన మండల కేంద్రంలోని అటవీ క్షేత్ర అ ధికారి కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణితో కలిసి ఆమె మొ క్కలు నాటారు.ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ర హదారుల వెంట విస్తృతంగా మొక్కలు నా టాలని సూచించారు.

రైతులు, ప్రజలు కోరి న మొక్కలను అందించడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పే ర్కొన్నారు.అనంతరం రెబ్బెన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల హాజరు, విద్యా సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం నమోదు లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగా హన కల్పించాలని సూచించారు.

గ్రామాభివృద్ధికి అధికారులు భాగస్వాములు కావాలి

గ్రామపంచాయతీల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేసి సమగ్ర కా ర్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. గురువారం కలెక్టరే ట్ లో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్తో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కా ర్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామపంచా య తీలకు అందుబాటులో ఉన్న 14వ, 15వ ఆర్థి క సంఘం నిధులను పూర్తిగా అభివృద్ధి పనులకే వినియోగించాలని ఆదేశించారు.

ఆ సరా పింఛన్ల పరిశీలన, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ప్రతిపాదనలు, రెండో వి డత ఇందిరమ్మ ఇళ్ల అర్హుల గుర్తింపు ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించా రు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రతిరోజూ చేపట్టాలని, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తా గునీరు అందించాలని పేర్కొన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, వీధి దీపాల నియంత్ర ణ, ఇంకుడు గుంతల నిర్మాణం, పల్స్ పో లియో కార్యక్రమం నిర్వహణపై ప్రత్యేక దృ ష్టి సారించాలని ఆదేశించారు.ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని, బూత్ స్థాయి అధికారులకు పంచాయతీ కార్యదర్శులు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.