ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మహబూబాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాం తి): పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
ఆదివారం ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, మహ బూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళినాయక్‌లతో కలిసి మరిపెడ మండల కేంద్రంలో మహిళ సాధికారిక ఇందిరమ్మ క్యాంటీన్‌ను ప్రారంభించారు. అబ్బాయపాలెంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు.
చిన్నారులకు యూనిఫామ్స్ అందజేశారు. కురవి మండలం కందికొండలో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా పాఠశాలల భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లా డుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభు త్వం రైతు సంక్షేమం కోసం రుణమాఫీ చేసిందన్నారు.
రైతుబంధును త్వరలోనే అందజేస్తామ న్నారు. ఐటీడీఏ, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. కాగా మహబూబాబాద్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారో త్సవంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పాల్గొన్నారు.
రైతులందరికీ రుణమాఫీ: సీతక్క
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పదవులు తీసుకోగానే సరిపోదని నాయకులు కష్టపడి పనిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు, భూములను పంపిణీ చేసిన ఘనత ఉన్నదన్నారు. అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్ కే వీర బ్రహ్మచారి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కందికొండలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఉండబోతున్నట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మానుకోట ఎంపీ బలరాంనాయక్, మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ పాల్గొన్నారు.






