calender_icon.png 7 December, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య జోనల్ స్థాయి క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభం

06-12-2025 11:32:39 PM

హన్మకొండ (విజయక్రాంతి): తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల(వరంగల్ జోన్) జోనల్ స్థాయి క్రీడలు, హన్మకొండ కాజీపేటలోని శ్రీ చైతన్య సీబీఎస్ఈ పాఠశాల ప్రాంగణంలో శనివారం శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడి కొండ ఎస్సై రాజ్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. పోటీల్లో వరంగల్ జోన్ లోని శ్రీ చైతన్య అన్ని బ్రాంచీల నుండి సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లంపాటి శ్రీధర్ మాట్లాడుతూ నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను క్రీడలు అనేవి పరిష్కరించే మార్గాన్ని సూచిస్తాయన్నారు.

శ్రీవిద్య మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని దానికి నిదర్శనంగానే ఈ వార్షిక ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. నేటి యాంత్రిక జీవితంలో విద్యార్థులు చదువులకే పరిమితం అవుతున్నారని, వారికి క్రీడలు పోటీ తత్వాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని అన్నారు. మడికొండ ఎస్సై రాజ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయని, విద్యార్థులలో విజయం పట్ల అభి రుచిని కలిగిస్తూ, విద్యార్థుల మధ్య ఐక్యతకు ఈ క్రీడలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్, కోకో, త్రోబాల్, చెస్, క్యారమ్స్, 100 మీటర్ల రన్నింగ్ వంటి క్రీడల్లో పోటీ పడతారని తెలియజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించి జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డీజిఎం చేతన్ మాదుర్, అకడమిక్ కో ఆర్డినేటర్ శివ కోటేశ్వరరావు, కాజీపేట శ్రీ చైతన్య పాఠశాలల ప్రిన్సిపల్ అనితారెడ్డి, వరంగల్ జోన్ పలు బ్రాంచీల ప్రిన్సిపాళ్లు, సురేఖ,శ్రీవిద్య ఉపాధ్యాయులు ఆనంద్ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.