04-12-2024 01:38:19 AM
జగిత్యాల, డిసెంబర్ 3 (విజయ క్రాంతి): ఉపాధి కోసం థాయ్‌లాండ్ వెళ్లిన ఇద్దరు తెలంగాణవాసుల ఆచూకీ తెలియడం లేదు. వారి మిస్సింగ్‌పై మంగళవారం వారి భార్యలు హైదరాబాద్‌లో జరిగిన ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ భర్తల ఆచూకీ తెలిపేలా రాష్ట్రప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల కథనం ప్రకారం..
జగిత్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన కొండ్ర సాగర్, నిజామాబాద్ జిల్లా షెట్పల్లికి చెందిన శనిగరపు అరవింద్ ఓ ఏజెంటుకు రూ. 2 లక్షల చొప్పున చెల్లించి విజిటింగ్ వీసా తీసుకున్నారు. గతనెల 11న ముంబై నుంచి బ్యాంకాక్‌కు వెళ్లారు. ఇదే నెల 21 నుంచి వారి ఆచూకీ తెలియడం లేదు. దీంతో సాగర్ భార్య కాశమ్మ, అరవింద్ భార్య జల ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.