calender_icon.png 1 July, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీటి వసతి కల్పిస్తాం

04-12-2024 01:38:05 AM

  1. మంత్రి తుమ్మల 

ఖమ్మం, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రఘునాథపాలెం మండలా నికి పూర్తిస్థాయిలో సాగునీటి కల్పిస్తానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చా రు. మంగళవారం ఆయన రఘునాథపాలెం మండలంలో పర్యటిం చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తద్వారా తన రాజకీయ జీవితం ధన్యమవుతుందని భావిస్తున్నాన్నారు.

మంచుకొండలో రూ.66 కోట్లతో ఎత్తపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొణిజర్ల మండలంలో త్వరితగతిన పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తన క్యాంప్ కార్యాలయంలో ఆయిల్ ఫెడ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రొత్సహిస్తుందన్నారు.