11 May, 2026 | 3:18 AM

రెండు బొటన వేళ్లతో.. డబుల్ థమ్స్ అప్

29-08-2024 05:13 PM

లండన్: బొటన వేలు గొప్పతనం ఏకలవ్యుడు ద్రోణాచార్యుల కథ చెబుతుంది. మానవుని కౌశలానికి స్కిల్ సెట్స్  రాతి యుగం నుంచి రాకెట్టు యుగం.. వరకు మానవ పరిణామంలో బొటన వేలు పాత్ర లేక పోతే మనం కూడా కోతులు, కొండెంగలు, చింపాంజీల స్థాయిలోనే ఆగిపోయేవారమని ఆంథ్రోపాలజిస్టులు విశ్లేషిస్తారు. అలాంటిది రెండు బొటన వేళ్లు ఉంటేనో స్కిల్ సెట్స్ డబుల్ అవుతాయి. ఆ మేరకు నెటిజనుల కీబోర్డ్ టైపింగ్ అండ్ టెక్స్టింగ్ స్పీడ్ పెరుగుతుంది. మూడు నిమ్మకాయల బదులు నాలుగైదు నిమ్మకాయలు పట్టకోవచ్చని స్కిల్ వర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. తాజాగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో యూనివర్సిటీ కాలేజి లండన్ పరిశోధకులు రూపొందించారు. దీన్ని పాదాలవద్దఉన్న వైర్ లెస్ గ్రహకాలతో కంట్రోల్ చెయ్యొచ్చు అంటున్నారు. కుడికాలు పెద్దన వేలుతో గ్రాహకాల మీద పీడనాన్ని కలుగజేస్తే  రోబో వేలు చేతి మధ్యలోకి  అడ్డంగా వస్తుంది.