11 May, 2026 | 4:32 AM

హైడ్రా అభివృద్ధికి రూ. 25 లక్షలు అందజేసిన ఎంపీ అనిల్

29-08-2024 04:52 PM

హైదరాబాద్: హైడ్రా అభివృద్ధికి  ఎంపీ నిధుల నుంచి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ రూ. 25 లక్షలు అందజేశారు. బుద్ధభవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఎంపీ అనిల్ యాదవ్ కలిశారు. హైడ్రా పనితీరుపై ఎంపీ అనిల్ హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా కు తన ఎంపీ లాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు కేటాయించారు. 25 లక్షలు కేటాయిస్తూ లేఖను కమిషనర్ రంగనాథ్ కు అనిల్ అందజేశారు. నగరంలో హైడ్రా కూల్చివేతలపై పలువురు ప్రశంసలు కురిపిస్తుంటే కొందరూ వ్యతిరేకిస్తున్నారు.