1 May, 2026 | 11:31 PM

ద్విచక్ర వాహనాలను దొంగలించిన దొంగ దొరికాడు

01-05-2026 10:15 PM

ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం సుమారు రెండు లక్షల రూపాయల ఖరీదు

దొంగ ఎల్లారెడ్డి పట్టణం చెందిన వాసి

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో వారంతపు సంతలో వాహనాలను దొంగలించిన దొంగ ఎట్టకేలకు పోలీసులు ప్రత్యేక చొరవతో గాలం వేసి పట్టుకున్నారు. ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను దొంగతనం చేసిన దొంగను పట్టుకొని ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం... 

వివరాలలోకి వెళ్తే, నిందితుడు మహమ్మద్ అహ్మద్ (వయసు: 40 సంవత్సరాలు, వృత్తి: కూలీ) ఎల్లారెడ్డి పట్టణంలోని న్యూ అబాది కాలనీలో నివసిస్తూ, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతను డూప్లికేట్ తాళాలు ఉపయోగించి బైక్‌లను దొంగతనం చేసి, వాటి నంబర్ ప్లేట్లను మార్చి తన అవసరాలకు వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

తేది 26.04.2026 న ఎల్లారెడ్డి వారం సంతలో పార్క్ చేసిన ఒక TVS XL వాహనాన్ని దొంగతనం చేసిన అనంతరం, మరిన్ని వాహనాలను దొంగతనం చేయాలనే ప్రయత్నంలో ఉండగా, పోలీసులు సాంకేతిక ఆధారాలు మరియు నమ్మకమైన సమాచారంతో నిందితుడిని గుర్తించి, 01.05.2026 న అతని నివాసంలో పట్టుకున్నారు.నిందితుడి ఒప్పుకోలు మేరకు, అతని ఇంటి వద్ద నుండి క్రింది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

1. హీరో హోండా ప్యాషన్ ప్రో (బ్లూ కలర్)

2. TVS XL (గ్రీన్ కలర్)

3. హీరో హోండా CD 100 SS (రెడ్ కలర్)

4. TVS XL (గ్రీన్ కలర్)

5. హీరో హోండా ప్యాషన్ ప్లస్ (రెడ్ కలర్)

ఈ వాహనాలలో కొన్ని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చబడినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వాహనాల మొత్తం విలువ సుమారు రూ. 200000/- గా అంచనా వేయబడింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించగా, ఈ కేసుతో సంబంధం ఉన్న మరిన్ని వివరాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌ను డీఎస్పీ ఎల్లారెడ్డి  శ్రీనివాసరావు గ పర్యవేక్షణలో, సీఐ ఎల్లారెడ్డి దొరవారి,రాజారెడ్డి  ఆధ్వర్యంలో, ఎస్సై  బి. మహేష్  సిబ్బంది ఎస్సై-2 సుబ్రహ్మణ్య చారి, ఏ ఎస్ఐ దేవగౌడ్, పోలీస్ సిబ్బంది, ఇద్రిస్, అనిల్ గౌడ్, సంజీవ్, రాజేశ్వర్ రావు,  గజీరాం కలిసి సమర్థవంతంగా కేసును ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  సిబ్బందిని అభినందించారు.

ఎల్లారెడ్డి పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి:

వాహనాలను భద్రంగా పార్క్ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద చర్యలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.