ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ లికై ఇద్దరు కార్మికులకు గాయాలు
ఆందోళనకు గురైన పలువురు కార్మికులు
కామారెడ్డి,(విజయక్రాంతి): ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ లీకై ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల పరిధిలోని ఎం ఎస్ ఎన్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ లీకై ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. కాచాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి కిషన్, మరో కార్మికుడు పనిలో ఉండగా రియాక్టర్ గ్యాస్ లీకై ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడడంతో పలువురు కార్మికులు పని నుంచి పరుగులు తీశారు.
గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించడంతో ఎమర్జెన్సీ సైరన్ మోగించడంతో కార్మికులందరూ భయాందోళనకు పరుగులు తీశారు. గాయపడిన ఇద్దరు కార్మికులను ఫ్యాక్టరీ యజమాన్యం ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఫ్యాక్టరీలో రియాక్టర్లు లీక్ అవుతు తున్న విషయాన్ని అధికారులకు తెలియజేసిన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పలువురు కార్మికులు తెలిపారు. విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తు ఇస్తుందోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఫార్మాసూటికల్ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల నీరు కాలుష్యం అవుతుందని గతంలో పలు గ్రామాల ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం విధిత మే. ప్రస్తుతం ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ లీకై ప్రమాదం సంభవించడంతో ఇద్దరు కార్మికులకు గాయాలైనట్లు కార్మికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న రియాక్టర్ స్థానాల్లో కొత్తవి అమర్చాలని కార్మికులు కోరుతున్నారు. అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. లేకుంటే కార్మికులకు ఇలాంటి ప్రమాదాలు నిత్యకృత్యం అవుతాయని కార్మికులు వాపోతున్నారు.






