calender_icon.png 20 January, 2026 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి సీబీఐ ఎదుటకు విజయ్

20-01-2026 01:44:30 AM

కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ

సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీ, జనవరి 19: ‘కరూర్ కార్నర్ మీటింగ్‌కు ఎందుకు మీ రాక ఆలస్యమైంది? అంతపెద్ద ఎత్తున మీటింగ్ జనం వస్తే తొక్కిసలాట నివారణకు మీరేం చర్యలు తీసుకు న్నారు?’ అంటూ తమిళ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  (సీబీఐ) ప్రశ్నించించినట్లు తెలిసింది. కరూర్ తొక్కిసలాట కేసులో భాగంగా సోమవారం ఆయన రెండో సారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక ఫ్లెట్‌లో విజయ్ ఢిల్లీకి చేరుకున్నారు.

అనంతరం 10 గంటలకు నేరుగా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సీబీఐ అధికారులు ఆయన్ను సు మారు ఆరు గంటల పాటు విచారించింది. సాయంత్రం 5 గంటల తర్వాత విజయ్ కా ర్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో జనవరి ౧౨న మొదటి సారి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మరోవైపు ఈకేసులో సీబీఐ వచ్చే నెలలో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేస్తుందని సమాచారం.