19 March, 2026 | 3:55 AM

ఎస్వీయంలో ఉగాది సంబురాలు

19-03-2026 02:29 AM

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): స్థానిక శ్రీనివాసనగర్‌లోని ఎస్‌వియం సెంట్రల్ పబ్లిక్ పాఠశాల ప్రాంగణంలో ‘పరాభవ’ నామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉగాది వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. షడ్రుచుల ‘ఉగాది పచ్చడి’ని విద్యారు ్థలందరికీ అందజేశారు. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ కిషోర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక విద్యతో పాటు మన పండుగల వెనుక ఉన్న అంతరార్థాన్ని, తెలుగు సంస్కృతిని గౌరవించడం నేర్చుకోవాలి అని ఆకాంక్షించారు.

మరో డైరెక్టర్ కొండ శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. ‘ ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడని. ఇందులో ఉండే ఆరు రుచులు మన జీవితంలోని సుఖదుఃఖాలకు ప్రతీకలని చెప్పారు. పాఠశాల డైరెక్టర్ ఉమా మాట్లాడుతూ.. భవిష్యత్తుపై కొత్త ఆశలతో ముందుకు సాగాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ‘వసంతం - ప్రకృతి’ అనే అంశంపై విద్యార్థులు స్వయంగా రాసిన కవితలను చదివి వినిపించారు.