భక్తిశ్రద్ధలతో ఉగాది పండుగ
శంకర్ పల్లి, మార్చి 19 (విజయక్రాంతి): శంకర్ పల్లి మండలంలోని గ్రామాలలో, మునిసిపల్ పరిధిలోని ప్రాంతాలలో గురువారం శ్రీ పరాభవ నామ ఉగాది పండుగలు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. షడ్రుచులతో తయారుచేసిన పచ్చడి ని ఒకరినొకరు ఇచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉదయం నుండే భక్తులు పలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పట్టణములోని శ్రీ గీత మందిరంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణాన్ని జోషి రాజు పంతులు పట్టణవాసులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో 12 వ వార్డ్ కౌన్సిలర్ దండు రాజేశ్వర్, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎం. ప్రకాష్ గుప్తా దిడిగే అనంతయ్య, మా శెట్టి పాండురంగ, దండు మోహన్, బచ్చు రామ్మోహన్, మా శెట్టి వెంకటేశం, మిరియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




