21 April, 2026 | 4:44 PM

Breaking News

మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •  

ఆకస్మిక తనిఖీ

02-04-2025 12:53 AM

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని త్రీ టౌన్ , మానకొండూరు పోలీస్ స్టేషన్లను మంగళవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం  ఆకస్మిక తనిఖీ చేసారు. పోలీసు స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాదీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగారు. పోలీస్ స్టేషన్ లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు.

వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు  సిసిటిఎన్‌ఎస్ లో పొందుపరచాలన్నారు.  పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకున్నారు. అర్బన్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి, మానకొండూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.