4 April, 2026 | 3:14 AM

పోలింగ్ బూత్‌లో అపస్మారక స్థితి.. ఆసుపత్రికి తరలింపు

12-02-2026 02:45 AM

నిజామాబాద్ ఫిబ్రవరి11(విజయ క్రాంతి): నిజామాబాదుపోలింగ్ కేంద్రం వద్ద ఒక వృద్ధుడు అనారోగ్యంతో ఒక్కసారిగా కింద పడిపోగా, అక్కడే విధుల్లో ఉన్నజిల్లా స్పెషల్ పార్టీ  సిబ్బందితక్షణమే స్పందించారు.

పరిస్థితిని గమనించిన పోలీసులు ఆయనను వెంటనే స్ట్రెచ్ప పడుకోబెట్టి , అక్కడికి చేరుకున్నఅంబులెన్స్‌వరకు జాగ్రత్తగా మోసుకెళ్లారు. అనంతరం ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల విధుల్లో ఉండి కూడా వృద్ధుడి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు తెలిపారు.