calender_icon.png 11 November, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారుబాంబు పేలుడు దారుణం

11-11-2025 01:02:45 PM

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి కడారి అశోక్ రావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఢిల్లీ ఎర్రకోట సమీపంలో  చోటుచేసుకున్న కారుబాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ దారుణ సంఘటనను భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోకరావు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిరపరాధుల కుటుంబాలకు ఆయన మంగళవారం  సంతాపాన్ని తెలిపారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. దేశ భద్రతను దెబ్బతీసే ప్రయత్నాలు ఎంతమాత్రం సహించరాదని, ఈ నరమేధానికి పాల్పడిన వారిని గుర్తించి చట్టం ముందు నిలబెట్టి కఠినమైన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి పేలుళ్ల వెనుక కుట్ర దాగి ఉందని, భారతీయ జనతా పార్టీని మానసికంగా దెబ్బతీయాలనే ప్రయత్నంగా ఇది కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల ఐకమత్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు విఫలమవుతాయని, బీజేపీ ఎప్పటికప్పుడు దేశ భద్రత, ప్రజల శాంతి, ఐక్యత కోసం కట్టుబడి ఉంటుందని అశోకరావు స్పష్టం చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.