20 July, 2026 | 8:39 PM

ఎల్ నినోపై అవగాహన

20-07-2026 01:54 AM
  1. నేడు అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు 
  2. ఉపాధి కల్పన, జల సంరక్షణకు ప్రాధాన్యం 

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి) : ఎల్ నినో ప్రభావంతో ఎదురయ్యే పరిస్థితులపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ కార్యాచరణ రూపొందించింది. ఆదివారం పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించేందుకు వచ్చే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నీటి సంరక్షణ పనులు చేపట్టనున్నారు. తెలంగాణ జలసిరి కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో సోక్‌పిట్లు, పంట కుంటలు, వర్షపు నీటిని నిల్వకు పర్కొలేషన్ ట్యాంకులు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు ఏర్పాటకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు దాన కిశోర్ తెలిపారు. కరువు ప్రభావాన్ని తగ్గించి, ప్రజలకు ఉపాధి, నీటి భద్రతను కల్పించడమే ప్రధాన లక్ష్యమని స్పెషల్ సెక్రటరీ పేర్కొన్నారు.