సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను సగర్వంగా ఎగరవేయడమే లక్ష్యం
- తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్
- కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పిలుపు
సూర్యాపేట, జూలై 19 (విజయక్రాంతి) : సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను సగర్వంగా ఎగురవేయడమే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన సీనియర్ నాయకులు, కౌన్సిలర్ వెలుగు వెంకన్నతో పాటు రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులను శనివారం నాడు పటేల్ రమేష్ రెడ్డి తన నివాసంలో పూలమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జరిగిన ముఖ్య సమావేశంలో పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే, మండలాలతో పోల్చితే సూర్యాపేట పట్టణ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తక్కువగా రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోపాన్ని అధిగమించడానికి పట్టణంలోని ప్రతి వార్డులోనూ బలిష్టమైన కమిటీలను ఏర్పాటు చేయాలని నూతన అధ్యక్షుడికి సూచించారు.






