16 April, 2026 | 4:46 AM

భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులు చేపట్టండి

03-04-2025 01:12 PM

అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే పాయం 

భద్రాద్రి కొత్తగూడెం (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని కరకగూడెం మండలం కొత్తూరు-చెప్పాలా బీటీ రోడ్ గత ఏడాది అకాల వర్షాలకు కోత గురైన రోడ్డు మరమత్ పనులు తక్షణమే ప్రారంభించాలని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కరకగూడెం మండలంలో పర్యటించి వర్షాకాలంలో కోతకు గురైన చెప్పాలా- కొత్తూరు గ్రామ మధ్యలో గల బీటీ రోడ్డు పరిశీలించారు.   బీటి రోడ్ అకాల వర్షాల కారణంగా కోతకుగురై తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టక పోవడంతో ప్రమాదవశాత్తుగా ఉండడంతో ఆగ్రహించారు. ఈ  కార్యక్రమంలో కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్, రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు