16 April, 2026 | 3:10 AM

హెచ్‌సీయూ క్యాంప‌స్‌లో విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష

03-04-2025 01:09 PM

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) భూముల వేలంపై విద్యార్థి సంఘాలు గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని భూములు యూనివర్సిటీకి చెందినవని, వెంటనే వాటి వేలాన్ని ఆపాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో క్యాంపస్ లో పీహెచ్ డీ చదువుతున్న యుగంధర్ అనే విద్యార్థి ఆమరణ నిరాహాదీక్షకు దిగాడు. హెచ్‌సీయూ  భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు దీక్ష విరమించేది లేదని యుగంధర్ స్పష్టం చేశాడు.

బుధవారం అర్థరాత్రి హెచ్‌సీయూ  మెడికల్ డిపార్ట్మెంట్(HCU Medical Department) ఆధ్వర్యంలో యుగంధర్ కు హెచ్‌సీయూ వైద్యులు ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే యుగంధర్ ఆరోగ్యంగా ఉన్నాడని నిర్దారించి  నిరాహార దీక్షకు అనుమతి ఇచ్చారు వైద్యులు. కాగా హెచ్‌సీయూ వద్ద విద్యార్థి సంఘాల  ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు పోలీసు మొలగాలు పెద్ద ఎత్తున మొహరించి  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు  జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.