calender_icon.png 16 October, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాలీబాల్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

15-10-2025 09:58:59 PM

చేగుంట: చేగుంట మండల పరిధిలోని వడియారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎస్జిఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-17 వాలీబాల్ క్రీడల్లో బాలబాలికల విభాగంలో 10వ తరగతి విద్యార్థిని పులి అర్చన, బాలుర విభాగంలో సిహెచ్ తరుణ్, రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లీలావతి. పిడి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా పాఠశాల నుండి విద్యార్థులు, రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, విద్యార్థులను ఎంపిక కావడానికి కృషి చేసిన పాఠశాల పిడి నాగరాజుకు ప్రత్యేక అభినందలు తెలియజేస్తూ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.