06-10-2025 02:28:55 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక జడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోంది. ఈ మేరకు పదాధికారుల సమావేశంలో అవలంభించాల్సిన వ్యూహాలపై, ఇతరాలపై తగు నిర్ణయాలు తీసుకుందుకు బీజేపీ కమిటీల ఏర్పాటుపై రేపు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు ప్రకటన చేయనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిని ఖారారు చేసేందుకు రేపు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఎల్లుండి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేసులో జూటూరు కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ, దీపక్ రెడ్డి ఉన్నారు.