calender_icon.png 6 October, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైన్స్ క్లబ్ ఆప్ భద్రాచలం శ్రీ రామ ఆవిర్భావం

06-10-2025 01:32:24 PM

భద్రాచలంలో మూడవ లైన్స్ క్లబ్ ఏర్పాటు

ఎంపికైన నూతన కార్యవర్గం

భద్రాచలం,(విజయక్రాంతి): లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం శ్రీ రామ నూతన క్లబ్ ఆవిర్భవించింది.  తెలంగాణ టూరిజం హోటల్ లో లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన సభ్యులు భద్రాచలం ప్రాంతంలో లైనిజం పెంచి తద్వారా ప్రజలకు సేవ చేసేందుకు మరో క్లబ్ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతను గురించి చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ భద్రాచలం శ్రీరామ అధ్యక్షులుగా చల్లగుండ్ల నాగేశ్వరరావు కార్యదర్శిగా భూక్య రంజిత్ కోశాధికారిగా జి భరత్ లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నూతన లైన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారం అక్టోబర్ 11వ తేదీన గవర్నర్ సమక్షంలో ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం శ్రీ రామ అధ్యక్ష కార్యదర్శులను కోశాధికారిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.