calender_icon.png 6 October, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంతో ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు సమావేశం

06-10-2025 01:57:58 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. ఇదే తరుణంలో ఎలి లిల్లీ అనే సంస్థ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రూ.9 వేల కోట్లతో ప్లాంటు, క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత చేసింది. ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు(Eli Lilly representatives) ఐసీసీసీలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revantha Reddy)తో సమావేశమయ్యారు. నగరంలో ఎలి లిల్లీ సంస్థ(eli lilly company)ను ఏర్పాటు చేసేందుకు ముందుకోచ్చిన ప్రతినిధులను సీఎం అభినందించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పరిశ్రమలు పెట్టే వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతిస్తుందని, ఫార్మా పాలసీని ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. జినోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, జినోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆనంద్ మహేంద్ర నేతృత్వంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో పార్మ్ ప్రముఖులు స్కిల్ వర్సిటీ బోర్డు సభ్యులుగా ఉన్నారని సీఎం వివరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎలి లిల్లీ సంస్థ అధ్యక్షుడు ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా అధ్యక్షుడు విన్సెలో టుకర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ హాజరయ్యారు.