calender_icon.png 8 November, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట క్షేత్రాలలో వేలాదిగా నాటు కోళ్లు..!

08-11-2025 12:32:24 PM

  1. ఊరంతా నాటుకోడి కూరనే
  2. నాటు కోళ్లను వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు
  3. కోళ్ల కోసం పరుగులెత్తిన ప్రజలు
  4. కోళ్లకు వైరస్ సోకిందని అనుమానం?

భీమదేవరపల్లి,(విజయక్రాంతి): పంట క్షేత్రాల్లో వేలాదిగా నాటుకోళ్లను(Natukollu) గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సంఘటన శనివారం వేకువజామున చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా(Hanumakonda District) ఎలుకతుర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో సుమారు 2000 వరకు నాటు కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం వదిలి వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు నాటు కోళ్లు వదిలి వెళ్ళిన సంఘటన ఎల్కతుర్తి(Elkathurthy) గ్రామంలో దావనంల వ్యాపించడంతో అనేకమంది గ్రామస్తులు పంట పొలాల్లో కోళ్లను పట్టుకుని పట్టుకునేందుకు పరుగులు తీశారు. కొంతమంది యువకులకు ఒకటి రెండు కోళ్లు దొరకగా మరికొంతమంది యువకులు ముందుచూపుతో ఇంటి వద్ద నుండి తెచ్చుకున్న బ్యాగులు పదుల సంఖ్యలో నాటు కోళ్లు దొరికాయి. ఏది ఏమైనా ఎగతుర్తి గ్రామంలో శనివారం వేలాది కుటుంబాల్లో ప్రతి ఇంట నాటుకోడి పులుసుతో గుమగుమలాడుతున్నాయి. కాగా నాటు కోళ్లు కు వైరస్ సోకడం వల్లనే 2000 పైగా గుర్తు తెలియని వ్యక్తులు బదిలీ వెళ్లి ఉంటారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.