30-04-2025 07:58:29 PM
పాపన్నపేట: ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఏఎస్సై గాలయ్య తెలిపిన వివరాల ప్రకారం... సుమారు 55-60 ఏళ్ల వయస్సు ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆలయం ముందు ఉన్న నదీ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ నీట మునిగి పోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఒంటిపై బ్రౌన్ కలర్ నిక్కరు మాత్రమే ఉందని ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే ఎస్సై శ్రీనివాస్ గౌడ్ 8712657920 సంప్రదించాలని సూచించారు.