calender_icon.png 1 May, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన జయ స్కూల్

30-04-2025 07:53:35 PM

కోదాడ: పట్టణంలోని జయ పాఠశాలకు చెందిన 98 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. ముగ్గురు విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించారన్నారు. ఆరుగురు 550 మార్కులు, 68 మంది 500కు పైగా మార్కులు సాధించారన్నారు. శరణ్య 586 మార్కులు, హర్షవర్దిని 583 మార్కులు, వేద 580 మార్కులు సాధించినట్లు వివరించారు. డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ, ప్రధానోపాధ్యాయులు చిలువేరు వేణు విద్యార్థులను అభినందించారు.