calender_icon.png 7 December, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ

07-12-2025 12:54:56 AM

-యశోద హాస్పిటల్స్ ఆధ్యర్యంలో రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ 

-ముఖ్య అతిథిగా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్  

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాం తి): యశోద హాస్పిటల్స్ -హైటెక్ సిటీ ఆధ్వర్యంలో యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కో పీపై (డిసెంబర్ 5, 6 తేదీల్లో) 2 రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్‌ను విజ యవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ఇండియన్ కోచ్ పద్మశ్రీ పుల్లెల గోపీచంద్, యశోద హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. యస్.రావుతో కలిసి సదస్సును ప్రారంభించారు.

ఈ సందరర్భంగా పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలో ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజురీస్ చాలా తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. యశోదా హాస్పిటల్ గ్లోబల్ యూబీఈ కాన్ -2025 ప్రపంచ స్థాయి క్రీడలలో కనిపించే అదే క్రమశిక్షణ, ఆవిష్కరణ స్ఫూర్తిని సూచిస్తుందన్నారు. డాక్టర్. జియస్ రావు మాట్లాడుతూ.. మినిమల్లీ ఇన్వాసివ్, ఎండోస్కోపిక్ స్పున్ సర్జరీ వైద్య విభాగం ఇప్పుడు ఎంతో అత్యాధునికతను సంతరించుకుంటూ, రోజు రోజుకూ తన పరిధిని విస్తరిం చుకుంటున్నదన్నారు.

యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ, ఇతర అధునాతన మినిమల్లీ ఇన్వాసివ్, ఎండోస్కోపిక్ స్పున్ సర్జరీ విధానాలలో తన అసాధారణ నైపుణ్యానికి గుర్తింపు పొందిన డాక్టర్. బాలరాజశేఖర్‌చం ద్ర, అద్భుతమైన ఫలితాలతో వేలాది సంక్లిష్ట వెన్నెముక శస్త్రచికిత్సలు చేశారని చెప్పారు. యశోద హాస్పిట ల్స్-హైటెక్ సిటీ, సీనియర్ న్యూరో, ఎండోస్కోపిక్ స్పున్ సర్జన్ డాక్టర్ బాలరాజశేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ‘గ్లోబల్ యు. బి.ఇ. కాన్-2025 అనేది కేవలం ఒక సమావేశం కాదు! ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న  రోగులకు మినిమల్లీ ఇన్వాసివ్, ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్సను ఖచ్చితమైనదిగా, సురక్షితమైనదిగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒక వేదిక అని తెలిపారు.

ఈ రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో 500 మందికి పైగా స్పున్ సర్జన్లు పాల్గొన్నారు. ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్స యొక్క భవిష్యత్తును రూపొందించడం మా లక్ష్యం‘ అని డాక్టర్. బాలరాజశేఖర్ చంద్ర అన్నారు.