calender_icon.png 7 December, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాంజా చుట్టుకుని తెగిన మెడ నరాలు

07-12-2025 12:53:23 AM

శస్త్రచికిత్స చేసి కాపాడిన కామినేని ఆసుపత్రి వైద్యులు

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాం తి): నగరంలోని గుర్రంగూడ ప్రాంతానికి చెం దిన కార్తీక్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఆయన ఇంటి నుంచి నాగోలు వైపు తనకు కాబోయే భార్యతో కలిసి బైకు మీద వెళ్తుండగా కామినేని ఫ్లై ఓవర్ ఎక్కిన కాసేపటికి అతడి మెడకు మాంజా చుట్టుకుంది. దాంతో అతడి మెడ కం డరాలతో పాటు, పైవైపు ఉండే రక్తనాళాలు కూడా తెగిపోయాయి. రక్తనాళం తెగడంతో రక్తస్రావం ఎక్కువగా ఉంది. ఆస్పత్రికి తీసుకురా గానే ముందు ఎమర్జెన్సీలో రక్తస్రావం ఆపేందుకు ప్రయత్నించారు.

అది సాధ్యం కాకపోవ డంతో అరగంటలోపే శస్త్రచికిత్స ప్రారంభించి తెగిపోయిన రక్తనాళాలను తిరిగి అతికించడం తో పాటు.. కండరాన్ని కూడా కుట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలిగారు. యువతికి మెడ దగ్గర, కంటి దగ్గర స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రిషిత్ బత్తిని నేతృత్వంలో జూనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సయ్యద్ మఝర్ అలీ, చీఫ్ కార్డియాక్ అనెస్థటిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్, కన్సల్టెంట్ అనెస్థటిస్ట్ డాక్టర్ రవళి సాదె పాల్గొన్నారు.