11 April, 2026 | 5:50 PM

Breaking News

సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే   •   అక్షరాయుధంతో అణచివేతపై పోరాడిన ధీశాలి పూలే   •   జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం   •   తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేత   •   CAA అమలు వేగవంతం— చొరబాటుదారులు సామాన్లు సర్దుకోవాల్సిందే! మోదీ హెచ్చరిక   •   విద్యా విప్లవానికి నాంది..   •   సామాజిక సమస్యలపై కార్మిక వర్గం పోరాడాలి   •   యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి   •   సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం   •   ఇరాన్‌ కండిషన్స్‌కు ఒప్పుకున్న అమెరికా   •  

ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించాలి

24-10-2025 05:04 PM

మందమర్రి,(విజయక్రాంతి): బ్యాంక్ ఖాతాదారులకు మరింత చేరువగా నాణ్యమైన సేవలు అందించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. శుక్రవారం మండలం లోని గద్దెరాగడిలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నూతన కార్యాలయాన్ని సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ (ఎజిఎం.) రాధాకృష్ణ, లీడ్ డిస్టిక్ మేనేజర్ తిరుపతి, శాఖ మేనేజర్ సంజీవ్ తలకోటిలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గద్దెరాగడి శాఖ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా ప్రజలకు, బ్యాంకు వినియోగ దారులకు బ్యాంకు సేవలు మరింత అందుబాటులోకి రానున్నారు. పొదుపు, బీమా, పెన్షన్, పెట్టుబడులు, అనేక అంశాలలో ప్రజలకు సేవలు అందించడం జరుగు తుందని, ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంక్ అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. శాఖ కార్యాలయం అభివృద్ధికి బ్యాంక్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.