calender_icon.png 24 October, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచాలి

24-10-2025 04:58:31 PM

భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలి

సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల జీవో సవరించి వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్టోబర్ 24 శుక్రవారం మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో వ్యవసాయ కూలీల సమావేశం సంఘం గ్రామ నాయకులు తాడూరు వీరేంకులు అధ్యక్షతన జరిగింది.

సమావేశంలో రాజన్న మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం భూమిలేని కూలీలకు ఏటా 12000 వేలు మహిళలకు 2500 వృద్ధాప్య వితంతు వికలాంగుల ఒంటరి మహిళల పెన్షన్ పెంపు ఇండ్లు ఇండ్ల స్థలాలు రేషన్ కార్డు పై 14 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారన్నారు పెండింగ్ లోను ఉపాధి కూలీల బిల్లులు వెంటనే చెల్లించాలని పని కోరిన వెంటనే జాబ్ కార్డుదారులందరికీ ఉపాధి పనులు కల్పించాలని గ్రామంలో కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు.