calender_icon.png 24 October, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం

24-10-2025 05:09:46 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం 57 వ మరియు 59వ  డివిజన్ లలో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీ నిర్మాణం, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి డివిజన్ లో  అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రానున్న  రోజుల్లో అన్ని డివిజన్లలో  పర్యటన చేసి ప్రతి కాలనీలో ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని అన్నారు.