4 July, 2026 | 11:18 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

28-06-2024 01:34 AM

సీపీఐ(ఎంఎల్-మాస్‌లైన్) ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఠాకూర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి) : దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో మోదీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని సీపీఐ (ఎంఎల్- మాస్ లైన్) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహించి తక్షణమే కేంద్ర విద్యా శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని మార్క్ భవన్ కార్యాలయంలో సీపీఐ (ఎంఎల్-మాస్‌లైన్) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుతో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యతగా వ్యవహారించడం లేదని నిలదీశారు. రాజ్యాంగ విలువలను, స్ఫూర్తిని దెబ్బతీసేలా మోదీ పాలన కొనసాగుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్ స్థానా న్ని ప్రతిపక్షానికి ఇవ్వాల్సి ఉండగా, ఆ సాంప్రదాయాన్ని కేంద్రం విస్మరించడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్దమని ఆరోపించారు. సమావేశంలో మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ రాంచందర్‌రావు, ఎం. హన్మేశ్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షు లు కేఎస్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.