18 April, 2026 | 12:20 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర ఘన నివాళి

10-04-2025 12:33 AM

నివాళులర్పించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్త, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ టైగర్ అలె నరేంద్ర వర్ధంతిని  గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో  కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నరేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కార్పొరేటర్ ఎ. పావని, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ మాట్లాడుతూ  తెలంగాణ సాధన పోరాటంలో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ నరేంద్ర, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా, మాజీ కేంద్ర మంత్రి గా ప్రజలకు విశిష్ట సేవలను అందించారని అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా నరేంద్ర కలలను సాకారం చేసేందుకు తాము ముందుకు సాగుతున్నమన్నారు.

నరేంద్ర స్ఫూర్తితో నాయకులు, కార్యకర్తలు ప్రజాభ్యున్నతికి కృషి చేయాలని వారు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అద్యక్షులు వీ.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఎం. ఉమేష్,సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, అశోక్ యాదవ్, శ్రీనివాస్ యాద వ్, సురేష్, లక్ష్మణ్ యాదవ్, దోనేటి సత్యం, డి. కుమార్ తదితరులు పాల్గొన్నారు.