25 April, 2026 | 2:12 AM

మృతురాలి కుటుంబానికి కేంద్ర మంత్రి పరామర్శ

25-04-2026 01:01 AM

హుస్నాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి) : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం రాత్రి హుస్నాబాద్‌లో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీజేపీ పూర్వ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ భార్య లక్ష్మీ (45) గుండెపోటుతో ఇరవై రోజుల క్రితం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ శ్రీనివాస్ నివాసానికి వెళ్లి లక్ష్మీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగా ఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.