10 March, 2026 | 5:38 AM

ద.మ రైల్వే జీఎంతో కేంద్ర మంత్రి భేటీ

07-03-2026 12:00 AM

సికింద్రాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైల్వే అభివృద్ధికి సంబంధించిన పలు ప్రణాళికలు,మౌలిక సదుపాయాల విస్తరణపై చర్చించారు.

ప్రాం తీయ అవసరాలకు అనుగుణంగా రైల్వే సేవలను మరింత మెరుగుపరచడం, ప్రయాణి కులకు సౌకర్యాలు పెంచడం,కొత్త ప్రాజెక్టులు అమలు చేసే అవకాశాలపై ఇద్దరూ చర్చించారు. రైల్వే రంగంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకి వివరించారు.