09-12-2025 12:21:31 AM
వైద్య ఆరోగ్యశాఖ నోడల్ ఆఫీసర్, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ అనిత
జన్నారం, డిసెంబర్ 8 : జిల్లాలో మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లలో పని చేసే వైద్య సిబ్బందికి, ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు ఫస్ట్ ఎయిడ్ కిట్ లను వైద్య ఆరోగ్యశాఖ నోడల్ ఆఫీసర్, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ అనిత అందజేశారు. సోమ వారం జన్నారం, దండేపల్లి మండలంలోని తాళ్లపేట, లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట్ పీ హెచ్ సీలను సందర్శించి ఫస్ట్ ఎయిడ్ కిట్టులను అందజేసి అత్యవసర మందులను, 108 సర్వీసులను ఆయా కేంద్రాలలో ఉంచాలని ఆదేశించారు.
ఆయా కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది ఆరు గంటలకి రిపోర్టు చేయాలని, యూనిఫామ్ లో ఉండాలని, వైద్య శిబిరంలో ఉపయోగించే మందులను తీసుకొని వెళ్లాలని సూచించారు. ఎన్నికలు జరిగే నాలుగు మండలాలను క్లస్టర్లుగా విభజించి ప్రోగ్రామ్ ఆఫీసర్లకు బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డిపిఓ ప్రశాంతి, సిహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, హెచ్‌ఈఓ లక్ష్మణస్వామి, వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.