2 April, 2026 | 6:49 PM

ఐక్యతకు మారుపేరు అలయ్ బలయ్

06-10-2025 12:00 AM

- మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ 

మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 5: ఐక్యతకు మారుపేరుగా అలైబలై కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ దగ్గర అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్ర చార సమితి పాలమూరు ఆధ్వర్యంలో అలైబలై కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

దీక్షా సమయంలో అల్పాహార, భోజనాలకు ఇబ్బంది కల గకుండా పాలమూరు పట్టణానికి ఒచ్చే మాలధారణ చేసుకున్న స్వాములకు అశోక్ టాకీస్ చౌరస్తాలో ఒక మండపాన్ని కట్టించడం జరిగిందన్నారు. అలై - బలై వేదికపై పార్టీలకు, కులాలకు, మ తాలకు అతీతంగా నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోశంగ ఉందన్నారు. ఇటువంటి వాతావరణం కల్పించినందుకు అయ్యప్ప దీక్ష ప్రచార సమితికి నా ప్రత్యేక ధాన్యవదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, యం సురేందర్ రెడ్డి, ఎన్పీ వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్, ఏపీ మిథున్ రెడ్డి, వీహెచ్పీ యాదిరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ వసంత వెంకటేష్, రాజ్ దేశ్ పాండే వ్యవస్థాపకులు అధ్యక్షులు, రమేషు, రఘురాం గౌడ్, ఏబీఎన్ సంతోష్, డబుల్ స్వామి నరసింహారావు, శ్రీనివాస్, రామచంద్రయ్య, శివ, అరుణ్ అఖిల భారత ప్రచార కమిటీ పెద్దలు పాల్గొన్నారు.