calender_icon.png 20 August, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు లేని రెడ్‌మిక్స్ ఆర్‌ఎంసీ ప్లాంట్ సీజ్

20-08-2025 01:26:02 AM

  1. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు 

పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి 

అబ్దుల్లాపూర్ మెట్, ఆగస్టు 19: రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధి కుంట్లూరు గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 177లో నిర్వహిస్తున్న నమిశ్రీ రెడ్ మిక్స్ ఆర్‌ఎంసీ ప్లాంట్‌కు సరిపడ అనుమతులు లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు, తన సిబ్బందితో కలిసి నమిశ్రీ రెడ్ మిక్స్ ఆర్‌ఎంసీ ప్లాంటును మంగళవారం సీజ్ చేశారు.

అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్ర భుత్వ నిబంధనలను పాటించకుండా రెడ్ మిక్స్ ఆర్‌ఎంసీ ప్లాంట్లను నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. నమిశ్రీ ఆర్‌ఎంసీ రెడ్ మిక్స్ ప్లాంట్‌కు సంబంధించిన అన్ని అనుమతు లు పొందిన తర్వాతనే ప్లాంటును నిర్వహించుకోవాలని కమిషనర్ సూచించారు. ము న్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా..

అనుమతులు లేకుండా ఎక్కడైనా రెడ్‌మిక్స్ ఆర్‌ఎంపీ ప్లాంట్లను నిర్వహిస్తే చర్యలు తప్పవని.. ప్లాంట్‌కు కావాల్సిన అన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతనే నిర్వహించా లన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధి కారులు, స్థానిక పోలీస్ అధికారులు తదితరులుపాల్గొన్నారు.