20-08-2025 01:25:40 AM
భూత్పూర్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భూత్పూర్ మండలంలోని పోతులమడుగు – గోపన్నపల్లి గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డి. జానకి స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... వాగు నీరు అధికంగా ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రాణాలకు ముప్పు కలిగే పరిస్థితుల్లో వాగు దాటే ప్రయత్నం చేయవద్దని అన్నారు. వర్షం తగ్గే వరకు అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని, చిన్నారులు, వృద్ధులు, మహిళలు వాగు దాటి వెళ్ళకుండా చూసుకోవాలని, స్థానిక పోలీసు సిబ్బంది నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతను నిర్ధారించాలని సూచించారు.