అకాల వర్షం.. అతలాకుతలం
ఈదురుగాళ్ల బీభత్సం
మార్కెట్ యార్డుల్లో తడిసిన పంట నిల్వలు
ఆదిలాబాద్/బోథ్/నిర్మల్/కుబీర్/బోథ్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): జిల్లాలోని వివిధ మండలాల్లో గతరాత్రి భీకరమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిం చింది. నిన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో, ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అయిన జనానికి గత రాత్రి కురిసిన అకాల వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం కలిగింది.
అకస్మాత్తుగా ముంచుకొచ్చిన అకా ల వర్షంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. ఆకాశం మేఘావృతమై, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో అంత అతలాకుతలం అయింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉం దని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మార్కెట్ యార్డులో అమ్మకానికి సిద్ధం గా ఉంచిన శనగ పంట నిల్వలు వర్షానికి తడిసిపోయాయి.
బోథ్, నేరడిగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణంలో ఏర్పడిన మార్పుతో వేసవి కాలం కాస్త వర్ష కాలంగా మారిపోయింది. ఈదురు గాలులకు తోడుగా భారీ వర్షాలతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటంతో పాటు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడింది.
అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు రూ. 5 లక్షల 50 వేల నష్టం సంభవించిందని ఆదిలాబాద్ విద్యుత్ శాఖ డి.ఈ ఈదన్న తెలిపారు. భారీగా ఈదురుగాళ్లతో పాటు వర్షం కురవడంతో 22 విద్యుత్ స్తంభాలు విరిగిపోయినట్టు సమాచారం వచ్చిందన్నారు. అయితే విద్యుత్ స్తంభాలు విరిగిన చోట కొత్త స్తంభాలను వేయడం జరుగుతుందని తెలిపారు. మరల పెళ్లి గ్రామ రూట్‌లో విద్యుత్ సరఫరాకు తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
తడిసిన పంట కుప్పలు..
ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్ యార్డుల్లో విక్రయానికి ఉంచిన శనగ కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. వర్షం నుంచి రక్షించేందుకు రైతులు టార్ఫిలిన్ కప్పినా పంట కుప్పల కిందకు వర్షపు నీరు చేరడంతో పంట నాణ్యత దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన పంటలో మొలకలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలును అధికారులు వేగవం తం చేయాలనీ కోరుతున్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనాలి
అకాల వర్షంతో మండలంలో రైతులు ఆరబెట్టిన జొన్న మొక్కజొన్న పంటలు తడిసిపో యాయని వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కోరా రు. మంగళవారం వర్షం కారణంగా ధన్నూర్ గ్రామంలో ఆరబెట్టిన జొన్న మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి, తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఆందోళన చెందవద్దని అధికారులతో మాట్లాడుతానని ప్రభుత్వం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉరుములతో కూడిన వర్షం
బైంసా డివిజన్‌లోని ఆయా మండలాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడినట్టు కుబీర్, కుంటాల, బైంసా, తానూర్, ముథోల్, దిల్వార్పూర్ నర్సాపూర్ మండలాల రైతులు తెలిపారు. దీంతో పంట కళ్ళల్లో ఆరబోసిన మొక్కజొన్న జొన్న పంట తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షంతో కొనుగోళ్లలో తిప్పలు
నిర్మల్ జిల్లాలో మంగళవారం కురిసిన అకాల వర్షం పంట కళ్ళల్లో నిలువ చేసిన పంటలకు నష్టాన్ని కలిగించింది. జిల్లాలో ఇప్పటికి యాసంగిలో సాగుచేసిన మొక్కజొన్న, జొన్న, మిర్చి, పొద్దు తిరుగుడు పంటలు ఆరబోస్తున్న సమయంలో కురిసిన వర్షం రైతులకు ఇబ్బందులకు కలిగించింది. అసలే తేమ ఉన్న పంటలపై వర్షం కురవడం వాతావరణం చల్లగా మారిపోవడంతో పంట ను రక్షించుకునేందుకు రైతులు టార్పిండ్లను కప్పి కాపలా కాస్తున్నారు. కుంటాల నిర్మల్ నర్సాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసినట్టు రైతులు తెలిపారు. పంట కొనుగోలు జాప్యం చేయడం వలన రైతులకు నష్టం వాటిలిందని ప్రభుత్వం వెంట నే కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.






